Saturday, 23 August 2014

కనిపించిన దేవత 'తను'



తను నా స్నేహం
తను నా ప్రాణం
తను నా లోకం
తను నా శోకం

కలలోనూ వీడలేను
ఇలలోనూ మరువలేను

కనిపించిన దేవత తను
తలపించిన వరుణం తను
నను తాకగ యద చేరిన
చిరు జల్లుల అల్లరి తను

తను నా సర్వమని
నా తను సర్వమని
తన స్నేహం వరమని
స్నేహం తన కరుణని

ఎనాటికైన,
తన స్నేహం నాకు శ్వాసనందిస్తూ
నా ప్రతి కదలికనూ
నా ప్రతి తలపులనూ
నాకోసమని భావించే నా తను
నా స్నేహం

-
స్నేహితుడు

No comments:

Post a Comment